భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి
ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు
వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా ఆదివారం విచారం వ్యక్తం చేస్తూ, దీని వల్ల ఉధృతమైన మరో విడత ఆర్థిక సంస్కరణలను సంబందించి పెట్టుబడుల వాతావరణం దెబ్బ తింటుందని చెప్పారు. కాగా భారత్‌ ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగానే మాట్లాడుతూ ‘దాని వృద్ధి గుర్తించదగిన రేటుతో కొనసాగుతోంది” అని పేర్కొన్నారు. అయితే, కొంత మేరకు భారత్‌ వృద్ధి మందగించడంతో అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద క్షీణతగా ప్రతిఫలిస్తోందని చెప్పారు. వాషింగ్టన్‌లో పీటీఐకీ ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌కు సంబంధిఆంచిన ఆంశాలపైన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత్‌-పాక్‌ సంబంధాలు, ఆసియా-ఫసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా వ్యూహంలాంటి అనేక విషయాలపై విస్తృతమైన ప్రశ్నలకు ఒబామా సమాధానమిచ్చారు. అమెరికా-భారత్‌ భాగస్వామ్యంలో పెద్ద పాత్ర వహిస్తున్న వాటిలో ఒకటైన అమెరికా వ్యాపార వర్గంలో చాలామంది భారత్‌లో పెట్టుబడుల వాతావరణం దిగజారుతుండడంపై ఆందోళన వ్యక్తపరుస్తున్నారనిఆయన పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ఇప్పటికీ కష్టంగా వుందని వారు నాకు చెప్పారు. ఇరుదెశాల్లో ఉద్యోగాల కల్పనకు అవసరమైన, అలాగే భారత్‌ వృద్ధి కొనసాగడానికి అవసరమైన చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో, విదేశీ పెట్టుబడులకు భారత్‌ పరిమితి విధించడమో లేక నిషేధించడమో చేస్తోంది అని అన్నారు. భారత్‌లోని ఆర్థిక క్లిష్ట పరిస్థితులకు ఏవైనా సూచనలు చేయడానికి ఆయన నిరాకరిస్తూ భారత్‌తో సహా ఏ ఇతర దేశాలకైనా వారి ఆర్థిక భవిష్యత్తును ఎలా రూపొందించుకుంటారో చెప్పడమనేది అమెరికా పని కాదు. అది భారతీయులే నిర్ణయించుకోవాలని అన్నారు. ఒబామా అధిక ప్రసంగంపై దేశీయ పారిశ్రామికవేత్తలు మండిపడ్డారు. దేశ ఆంతరంగిక విషయాలు ఒమాబా జోక్యం అవసరం లేదన్నారు. భారత్‌ ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో భారతదేశమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అమెరికాలో జరుగుతున్న వాల్‌స్ట్రీట్‌ మూమెంట్‌ను చూసుకోవాలని చురకలంటించాయి.