భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా నగర కాంగ్రెస్ పాదయాత్ర

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :

రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు నుండి మంచిర్యాల చౌరస్తా, గాంధీ రోడ్డు టవర్ సర్కిల్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కమాన్ వరకు పాద యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి మాట్లాడుతూ దేశంలో కుల మతప్రాదిపది
కనచిచ్చురగల్చి దేశాన్ని ముక్కలు చేయడానికి మతతత్వశక్తులు చేస్తున్న కుట్రలను ప్రజలకు తెల్పుతూ, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. వారు చేపట్టిన పాదయాత్ర కు సంఘీభావంగా పి సి సి ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ లో పాద యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. పాదయాత్రలో ప్రజలను పలకరించుకుంటు కమాన్ వద్ద ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైద్యుల అంజన్ కుమార్, రాహ్మత్ హుస్సేన్, సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్, ఎస్ ఏ మోసిన్,చర్ల పద్మ,లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, ఎం హెచ్ జోహార్, గడ్డం విలాస్ రెడ్డి, ఎం డి ఇర్ఫాన్, సలీమొద్దిన్, కొరివి అరుణ్ కుమార్, షబానా మహమ్మద్, మ్యాకల నర్సయ్య,దన్న సింగ్, యనమల మంజుల, బత్తిని చంద్రయ్య, అస్థపురం రమేష్, ఎం డి చాంద్, ముక్క భాస్కర్, ఎజ్రా, దీకొం డ శేకర్, కీర్తి కుమార్, శారద,మామిడి సత్యనారాయణ రెడ్డి, జీ డి రమేష్, వంగల విద్యా సాగర్, నాగుల సతీష్, హైమద్, హనీఫ్, జాఫర్,జిలకర రమేష్, కుంబాల రాజ్ కుమార్, వనిత, కవిత,హనీఫ్, మంద వెంకట్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.