భారత వాయునేన సామర్థ్యం పెంపు: బ్రౌన్‌

హైదరాబాద్‌: చైనా, పాకిస్తాన్‌లాంటి పొరుగుదేశాలను చూసి భారతీయ వాయుసేవ ఆధునీకరణ జరుగుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఎయిర్‌ చీఫ్‌మార్షల్‌ ఎన్‌.ఎ.కె.బ్రౌన్‌ స్పష్టంచేశారు. సామర్థ్యం పెంపు ప్రణాళికలో భాగంగానే 2017నాటికి పూర్తిగా ఆధునీకరిస్తామని వాయుసేన ప్రధానాధికారి తెలిపారు. దుండిగల్‌ ఎయిర్‌పఫోర్స్‌ అకాడమీలో శిక్షణపూర్తి చేసుకున్న క్యాడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం అయన మాట్లాడుతూ. భారత అవసరాల రీత్యా యుద్దవిమానాల స్వ్కాడ్రన్ల సంఖ్యను 32నుంచి 45కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే లక్షా 12వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను కుదుర్చుకున్నట్లు బ్రౌన్‌ తెలిపారు. భారతీయ వాయుసేనకు ఐదో తరం యుద్ద విమానాలను కూడా సమకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న మిగ్‌లను దశలవారీగా తొలగించి వాటి స్థానంలో అత్యాధునిక యుద్ధవిమానాలైన సుఖోయ్‌.30 ఫైటర్‌, జెట్లను ప్రవేశపెడతామని బ్రౌన్‌ వెల్లడించారు.