భాష అమలుకు ప్రజల నుంచి ఒత్తిడి

దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ యువతి సామూహిక మానభంగానికి గురైంది. ఆ సంఘటన దేశ ప్రజలందరీని దిగ్బ్రా ంతికి గురి చేసింది. న్యాయమూర్తి అందుబాటులో ఉన్నప్పటికి ఎగ్జి క్యూటివ్‌ మెజిస్ట్రేట్‌లో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయించారు. ఆ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ మీద పోలీసులు ఒత్తిడి తెచ్చే అవకాశం వుంటుంది. అక్కడ అవే ఆరోపణలు వచ్చాయి. ఆ విధంగా ఒత్తిడి తీసుకొని రావడాన్ని ప్రజలు ప్రశ్నించారు కానీ ఆ జ్యుడీషియల్‌ మెజిస్ట్రీయల్‌ అందుబాటులో వుండగా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌లో ఎందుకు నమోదు చేయించారని ఎవరూ ప్రశ్నిచలేదు. దీనికి కారణాన్ని అన్వేశిస్తే లభించే సమాధానం ఆ అవగాహన ప్రజలకి లేకపోవడం. మరణ వాంగ్మూలాల స్టేట్‌మెంట్‌ని జ్యుడీ షియల్‌ మెజిస్ట్రేట్‌ల ద్వారా నమోదు చేయించాలి. ఆ న్యామూర్తులు ఆందుబాటులో లేనప్పుడు అత్యవసర పరిస్ధితులోనే ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ల ద్వారా నమోదు చేయించాల్సి వుంటుందనే పరిజ్ఞానం ప్రజలకి లేదు. దీనికి కారణం ఏమిటీ? ఈ ప్రశ్నకి సమాధానం ఒక టి నిరక్షరాస్యత అయితే, మరోకటి అవగాహన లేకపోవడం. ఇక్కడ భాష ప్రముఖ పాత్రని పోషిస్తుంది. శాసనాలు, కోర్టులలోని ప్రక్రియ ఇంగ్లిష్‌లో వుంటే వాటి పరిజ్ఞానం అక్షరాస్యులకి ఏవిధంగా లభి స్తుంది. ఇది ప్రశ్న.పరిపాలన న్యాయపాలన తెలుగు భాషలో జర గాలని అందరూ అంటారు. ప్రభుత్వం ఇంకా గట్టిగా అంటుంది. కానీ ఇందుకు తగిన చర్యలు వుండవు. నామ మాత్రంగా ఎలాంటి అధికారం లేని అధికార భాషా సంఘం వుంటుంది. ప్రభుత్వం అను కుంటే పాలన తెలుగు భాషలో జరుగుతుంది. ఇంగ్లిషులో రాయ డానికి అలవాటు పడ్డ వ్యక్తులకి తెలుగులో రాయడం కొంచం అసౌ కర్యంగా అన్పించవచ్చు. కానీ అది దుసాధ్యం కాదు. అబి óప్రాయల నీ, అభవ్యక్తులనీ మాతృభాషలో చాలా స్పష్టంగా సూటిగా వ్యక్తపరిచే అవకాశం వుంటుంది. పరాయి భాష ఎంత నేర్చుకున్నా అది పరా యి భాషే. కొన్ని సాంకేతిక పదాలని తెలుగులో వ్యక్త పరచడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇది తాత్కాలికమే. కొంతకాలం తరువాత అన్ని పదాలు తెలుగులో ఒదిగిపొయ్యేలా కొత్త పదాల సృష్టి జరుగుతుంది. ప్రభుత్వం తలుచుకుంటే తెలుగు పాలనా భాష అవుతుంది. హైకోర్టు తలుచుకుంటే దిగువ కోర్టుల్లో తెలుగు అమ లవుతుంది. ప్రజలు చేయ్యాల్సిందల్లా ప్రభుత్వం న్యాయవ్యవస్థ తలు చుకునేలా చేయడం, ప్రజలు సమష్టిగా ఈ భావనికి వస్తే ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి తీసుకొని రావచ్చు. ఓట్ల కోసం రాజకీయ నాయ కులు తమ దగ్గరకి వచ్చినప్పుడు ప్రజల భాషలో పాలన కావాలని ఒత్తిడి చేయవచ్చు. ప్రజల నుంచి ఈవిధంగా ఒత్తిడి వస్తే ప్రజల భాషలో పాలనని అందిస్తామని ప్రజల భాషలో శాసనాలని అంది స్తామని రాజకీయ పార్టీలు తమ మేనిపెస్టోలలో ప్రకటించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఒత్తిడి తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రజల మీద వుంది.

ఇక, కోర్టుల విషయనికి వస్తే, క్రిమినల్‌ కోర్టుల్లో న్యాయపరిపాలన తెలుగులో జరుపవచ్చు. క్రిమినల్‌ కేసుల విచా రణా పద్ధతిని క్రిమినల్‌ ప్రోసిజర్‌ కోడ్‌లో చెప్పారు. అదేవిధంగా సివిల్‌ కేసులకు సంబంధించిన పద్ధతిని సివిల్‌ ప్రోసిజర్‌ కోడ్‌లో పొందుపరిచారు. ఈ రెండు శాసనాలని కూడా వలస పాలకులే త యారు చేశారు. అయినా కూడా దిగువ కోర్టుల్లోని భాషని నిర్దేశించే అధికారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వలకి ఇచ్చారు. క్రిమినల్‌ ప్రొస జర్‌ కోడ్‌ 1898ని మళ్లీ మన భారత ప్రభుత్వం సవరించి కొత్త చట్టాన్ని 1974 లో తీసుకొని వచ్చి ంది. ఈ చట్టంలోని ప్రధాన నిబం ధన 272, ఈ నిభంధన ప్రకారం హైకోర్టు కాకుండా మిగతా క్రిమిన ల్‌ కోర్టుల్లో వాడుకునే భాషని నిర్దే శించే అధికారం అయా రాష్ట్ర ప్ర భుత్వాలకి వుంటుంది. ఈ శాసనం అమల్లోకి వచ్చే ముందు మన రాష్ట్ర ప్రభుత్వం 29 మార్చి 1974 రోజున జీవో ఎం.ఎస్‌.నం. 485ని జారీ చేసింది. ఈ నిబంధన ప్రకా రం తెలుగుని అన్ని జిల్లాలోని క్రిమి నల్‌ కోర్టు అధికార భాషగా ఎప్రిల్‌ 1, 1974ని ఉపయోగించుకో వ చ్చు. కానీ అది నామమాత్రంగానే వుండిపోయింది. నాలాంటి కొంత మంది న్యాయమూర్తులు ఈ దిశగా ప్రయత్నం చేసినప్పటికీ అది అ నుకున్న రీతిలో ఊపందుకోలేదు. ఇక్కడ ప్రజల నుంచి ఒత్తిడి అవ సరం. తీర్పులని తెలుగులో చెప్పమని కోర్టులపై ప్రజలు ఒత్తిడి తీసుకొని రాకపోవచ్చు. ఎందుకంటే ఇంగ్లిష్‌ కూడా కోర్టు అధికార భాషే. అయితే క్రిమినల్‌ కేసుల్లో సాక్షó్యం ఇస్తున్న వ్యక్తులు తాము చెబుతున్న సాక్ష్యాన్ని తెలుగులో నమోదు చేయమని కోర్టులని కోరి ఒత్తిడి తీసుకొని రావొచ్చు. ఇది పరోక్షంగా కోర్టులు తెలుగులో తీర్పులు చెప్పడానికి ఉపయోగపడుతుంది. తెలుగులో సాక్షాలని నమోదు చేయడం వల్ల తాము చెప్పింది నమోదు అయిందా లేదా సాక్ష్యాలు సులభంగా తెలుసుకునే  అవకాశం ఏర్పడుతుంది. ముదా ్దయికి సాక్ష్యం అర్థమై సరైన రక్షణలు తీసుకునే వీలు చిక్కుతుంది. తెలుగులో తీర్పులు రావడం వల్ల తనపై కేసు ఎలా రుజువైందన్న విషయం ముద్దాయికి, రుజువు కానప్పుడు ఎందుకు రుజువుకాలేదు తెలుసుకునే అవకాశం బాధితులకి వుంటుంది. కోర్టు బహిరం గంగా వుంటుంది కాబట్టి కోర్టులో ప్రక్రియ తెలుగులో జరిగితే కోర్టులో వున్న వాళ్లకి సులభంగా బోధపడుతుంది. దీని వల్ల కోర్టు లు ప్రజలకి దగ్గర కావడమే కాదు కోర్టుల మీద విశ్వాసం కూడా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.

ఇక సివిల్‌ కేసుల విషయానికి వస్తే దిగువ కోర్టులో తెలుగు వాడే విధంగా వెసులుబాటు కల్పించే నిబంధన 137 వుం ది. కింది కోర్టుల్లో సివిల్‌ కేసుల విచారణ ఏ భాషలో జరగాలి అని నిర్దారించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నిబంధన ప్రకా రం వుంది. తెలుగుని సివిల్‌ కోర్టుల్లో ఉపయోగించే విధంగా చట్ట సవరణ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. తెలుగు అమలు కోసం అప్పటి అధికార భాష సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్‌ తీవ్రంగా కృషి చేశారు కానీ చట్ట సవరణ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరల్చలేదు. కానీ ఆయన చేసిన కృషిని మరవ కూడదు. తెలుగులో వచ్చిన తీర్పులని సేకరించి నమునాగా ప్రచురించారు. మండలి బుద్దప్రసాద్‌ అధికార భాషా సంఘం అ ధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ దిశగా కృషి జరు గుతుందని ఆశించవచ్చు. ఆయనకు రెండు అర్హతలు వున్నాయి. ఆయన రాజకీయవాది భాషాభిమాని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర భావితం చేసి ఈ నిబంధనకి సవరణలు తీసుకొస్తారని ఆశిం చవచ్చు. 1970 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌, 1983 లో రాజస్తాన్‌ రాష్ట్రాలు ఈ నిబంధనకి సవరణలు తీసుకొని వచ్చి అక్కడి ప్రాంతీ య భాషలో తీర్పులు చెప్పడానికి వెసులుబాటు కల్పించాయి.

హైకోర్టు, సుప్రీంకోర్టు విషయానికి వస్తే అక్కడి కోర్టుల్లో వాడే భాషని నిర్ధారించే అధికారం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి వుండే అవకాశం లేదు. కానీ ఆ కోర్టుల భాషని నిర్ధారించే అధి కారం పార్లమెంట్‌కి వుంది. భారత రాజ్యంగంలోని 348 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఉపయోగించే భాషను నిరా ్ధరించే అధికారం పార్లమెంట్‌కి వుంది. ఈ ఆధికరణలోని ఉప నియ మం (1) ప్రకారం సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులలో న్యాయ ప్రక్ర ియ తప్పని సరిగా ఇంగ్లిషులునే జరగాలి. ఇందుకు భిన్నంగా న్యాయ ప్రక్రియ జరపడానికి శాసనాన్ని చేసే అధికారం పార్లమెం ట్‌కి వుంది. కానీ ఆ ప్రయత్నం ఇంతవరకు జరుగలేదు. అందుకని 1947 నుంచి ఇప్పటి దాకా ఆ కోర్టుల్లో న్యాయ ప్రక్రియ ఇంగ్లిషు లోని జరుగుతుంది. అక్కడ కూడా ప్రాంతీయ భాషల్లో న్యాయ ప్రక్రియ జరపాలని ఆశించడం అత్యాశే అవుతుంది. అంతే కాదు అది అమలు సాధ్యం కూడా కాదు. మన దేశంలో ఎన్నో భాషలు వున్నాయి. హిందీని దేశీయ భాషగా వ్యతిరేకించే వ్యక్తులూ వున్నారు. ఇంతే కాకుండా ఇంగ్లిషు భాష అంతర్జాతీయ భాషగా రూపు దిద్దుతుంది. ఈ దశలో ఆ కోర్టుల్లో భాష మారాలని కోరుకో వడం సరైంది కాదని నా వ్యక్తిగాత అభిప్రాయం. అది అచరణ సాధ్యం కూడా కాదు.ఆచరణ సాధ్యం కాని విషయానికి సబంధించి ఆశపడి ఒత్తిడి తెచ్చే బదులు ఆచరణ సాధ్యమయ్యే దానికి ఒత్తిడి తెస్తే బాగుంటుంది. అది సమంజసం కూడా. దిగువ కోర్టుల్లో తెలు గు భాష వినియోగం గురించి ప్రబుత్వం కృషి చేసేలా ప్రజలు ఒత్తి డి చేయాలి. అప్పుడే ప్రజల భాషలో పాలన, న్యాయ పాలన జరుగు తుంది. అది అవసరం కూడా ప్రజలూ పాలకులూ భాషా భిమానులూ ఈ విషయాన్ని గుర్తూంచుకోవాలి. అప్పుడే ప్రజలకి మేలు జరుగుతుంది.