భూములను అన్యక్రాంతం చేస్తే ఊరుకోం : శ్రవణ్‌

హైదరాబాద్‌ : కిరణ్‌కుమార్‌ సర్కార్‌ తెలంగాణ భూములను అన్యాక్రాంతం చేస్తే ఊరుకోమని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా.శ్రవణ్‌ హెచ్చరించారు. వై.ఎస్‌.చంద్రబాబు బాటలోనే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా నడుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భూములను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ ఎండీఏ ఇష్టాను సారంగా వేలం పాటలు నిర్వహిస్తు రూ.వందల కోట్ల సొమ్ము చేసుకుంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కిరణ్‌ సర్కార్‌ తెలంగాణ భూములను పరిశ్రమలకు దోచిపెడ్తున్నదని మండిపడ్డారు.వచ్చే తెలంగాణ భూములే ఆధారమని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అక్రమంగా దోచుకుంటున్న భూములపై విచారణ జరిపిస్తామని తెలిపారు. హెచ్‌ఎండీఏ తక్షణమే భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.