భూ పంపిణీ భూములకు హద్దులు నిర్ణయించాలి
– జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన తండావాసులు జనంసాక్షి, మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని పాలకుర్తి మండలం భామ్లానాయక్ తండా గ్రామపంచాయతీలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నెంబర్ 111లో 66 మందికి ఒక్కొక్కరికి 24 గుంటల భూమి భూ పంపిణీ కింద ఇవ్వడం జరిగిందని, తమకు పట్టా వాస్తు పుస్తకాలు సైతం ఉన్నాయని, తమ భూములకు హద్ధులు తెలియక ఇబ్బందులు పడుతున్నామని, హద్దులు నిర్ణయించి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కి సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు తండా వినతి పత్రం సమర్పించారు.