మంత్రుల కమిటీ కన్వీనర్‌గా ధర్మాన

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషణ, భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటయింది. ధర్మాన ప్రసాదరావు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి,కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, విశ్వరూప్‌, పితాని సత్యనారాయణ, డీకేఅరుణ, తోటనర్సింహం, సారయ్య, రామచంద్రయ్యలు నియమితులయ్యారు. పార్టీ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలన్న అంశం పై కమిటీ దృష్టి సారించనుంది.