మంథని డివిజన్ కు రూ. 1. 30 కోట్ల డిఎంఎఫ్టి నిధులు మంజూరు – మంథని ఎమ్మెల్యే
శ్రీధర్ బాబు జనం సాక్షి , మంథని : తాను పంపిన ప్రతిపాదనల మేరకు తెలంగాణ ప్రభుత్వం డిఎంఎఫ్టి నిధులు కోటి రూపాయలు, ఎస్ డి ఎఫ్ కింద 30 లక్షల రూపాయలు మంజూరైనట్లు మంథని ఎమ్మెల్యే దుద్దుల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథని అయ్యప్ప టెంపుల్ మంథని అంబేద్కర్ భవనం కమ్యూనిటీ హాల్, ఇతర పనులు రోడ్డు గ్రామాల కలుపుకొని కోటి రూపాయలు, ఎస్డిఎఫ్ కింద అడవి సోమనపల్లి, గుంజపడుగు, ముత్తారం మూడు గ్రామాలకు వైకుంఠ రథంలు, ఫీజర్, 30 లక్షలు మంజూరు అయ్యాయి. మంథని పట్టణం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు రూ.10.00 లక్షలు, మంథని పట్టణంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10.00 లక్షలు, మంథని అయ్యప్ప టెంపుల్ (మంజునాథ నిలయం) టూ ఆర్ అండ్ బి రోడ్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం కొరకు 3.00 లక్షలు, మంథని పట్టణంలో మహావది సత్య నారాయణ ఇంటి నుండి సైకంపల్లి పల్లి రవి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కొరకు 15.00 లక్షలు, మంథని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ వర్క్స్ కొరకు 2.00 లక్షలు, అడవి సోమనపల్లి గ్రామంలో పాగే కిష్టయ్య ఇంటి నుంచి జనగామ సమ్మయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం కొరకు 4.00 లక్షలు, గుంజపడుగు గ్రామంలో ఇంటర్నల్ సిసి రోడ్ల నిర్మాణం కొరకు 4.00 లక్షలు, ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో సోమిశెట్టి పెద్ద వెంకటేశం ఇంటి నుంచి పోచమ్మ టెంపుల్ వరకు 4.00 లక్షలు, రామగిరి మండలం పన్నూరు గ్రామంలో బుదారపు శంకర్ ఇంటి నుంచి పన్నూరు వాగు వరకు 4.00 లక్షలు, బుధవారం పేట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి 4.00 లక్షలు లద్నాపూర్ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కొరకు 3.00 లక్షలు, కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5.00 లక్షలు, లింగాల నాగారంలో పోచమ్మ టెంపుల్ వద్ద కమ్యూనిటీ 5.00 లక్షలు, పేరపల్లి ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5.00 లక్షలు, కమాన్పూర్ ఆదివరాహ స్వామి గుడికి వెళ్లే దారిలోని పోచమ్మ గుడి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5.00 లక్షలు, రొంపికుంట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి 4.00 లక్షలు, గొల్లపల్లి గ్రామంలో మైన్ రోడ్ టూ గ్రేవ్ యార్డ్ వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 4.00 లక్షలు, గుండారం గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 4 లక్షలు, పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5.00 లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలకు డి ఎం ఎఫ్ టి కింద ఒక కోటి రూపాయలకు సంబంధించిన సీసీ రోడ్డు, వైకుంఠ రథలు, కమ్యూనిటీ హాల్ లో, ఇతర పనులు మంజూరు చేసేలా కృషి చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.