మంథని డివిజన్ కు రూ. 4 కోట్ల డిఎంఎఫ్టి నిధులు మంజూరు
– పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ జనం సాక్షి, మంథని : తాను పంపిన ప్రతిపాదనల మేరకు మంథని నియోజకవర్గానికి డిఎంఎఫ్టి నిధులు 4 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసినట్లు పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ తెలిపారు. మంథని నియోజకవర్గంలో ఖానాపూర్, గద్దలపల్లి గ్రామాల్లో బీటీ రోడ్లు, ఇతర గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు మంజూరు అయిన వాటిలో ఉన్నాయి. నిధులు మంజూరు అయిన పనుల సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంథని మండలం మంథని గ్రామం నుండి ఖానాపూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి 1.50 కోట్లు, మంథని మండలం గద్దలపల్లి గ్రామం నుండి సీతంపేట గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బ్రిడ్జి నిర్మాణంతో సహా 1.85 కోట్లు, కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో మల్టీ పర్పస్ హాల్ 10 లక్షలు, కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో యాదవ సంఘము కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, కమాన్ పూర్ మండలం నాగరం గ్రామంలో గౌడ సంఘము కమ్యూనిటీ హాల్ 5 లక్షలు , కమాన్ పూర్ మండల కేంద్రంలో కురుమ సంఘం కమిటీ హాల్ 10 లక్షలు, కమాన్ పూర్ మండలం జులపల్లి గ్రామంలో తాపీ మేస్త్రి సంఘం కమ్యూనిటీ హాల్ 5 లక్షలు, మంథని పట్టణంలో మహిళ భవన్ 7 లక్షలు, కమాన్ పూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్ ఆర్ అండ్ బి రోడ్డు నుండి జగదీశ్వర్ రావు ఇంటి వరకు 3 లక్షలు, మంథని పట్టణంలో కబరస్థాన్ నిర్మాణం కోసం 10 లక్షలు, పాలకుర్తి మండలం జీడీ నగర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కొమిరె ఐలయ్య ఇంటి నుండి పందిళ్ల తిరుపతి ఇంటి వరకు 10 లక్షలు మంజూరైన వాటిలో ఉన్నాయి. మంథని డివిజన్ కు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు, కలెక్టర్ సంగీత సత్యనారాయణ కు, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కు ఆయా మండలాల గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.