మందపాడు వద్ద నిలిచిపోయిన నాగర్‌సోల్‌-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు రైల్వేగేటు క్రాసింగ్‌ వద్ద నాగర్‌సోల్‌-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గంటన్నర నుంచి రైలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. మందపాడు నుంచి పదో తరగతి పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గు/ొతున్నారు.