మజ్లిస్ నిర్ణయాన్ని ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకిస్తున్నారు : శైలజానాథ్
హైదరాబాద్: కొత్త మిత్రులను వెదుక్కొన్న మజ్లిన్ నేతలు కాంగ్రెస్‌ను నిందించడం తగదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ అన్నారు. కాంగ్రెస్ మతతత్వ శక్తులతో చేతులు కలిపిందనే మజ్లిన్ నిర్ణయాన్ని ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. మజ్లిన్ దూరమైనందుకు తాము బాధపడడం లేదని ప్రజలకు వాస్తవాలన్నింటిని వివరిస్తామని శైలజానాథ్ తెలియజేశారు.