మణిపూర్‌ పోలీసు కాల్పుల్లో జర్నలిస్టు మృతి

మణిపూర్‌: మణిపూర్‌లో జరుగుతున్న రెండోరోజు బంద్‌, ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరపగా ఒక పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయాడు. మణిపూర్‌కి చెందిన ఒక నటిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ‘ప్రైమ్‌ న్యూస్‌ ‘ పత్రిక విలేకరి ననావో సింగ్‌(29) ఛాతీలోకి బుల్లెట్‌ పోవడంతో ఈరోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో కన్నుమూశాడు. అతని మృతి వార్త తెలియడంతో ఆందోళనకారులు మరింతగా  ఆగ్రహించి మణిపూర్‌ లోయ. ఇంఫాల్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో హింసాత్మక సంఘటనలకు పాల్పడినట్లు సమాచారం తెలిసింది.