మద్దతు కోసం రాష్ట్రానికి ప్రణబ్‌

జులై 1న జూబ్లీ హాల్‌లో, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ
– టిడిపి, టిఆర్‌ఎస్‌, జగన్‌ ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం
హైదరాబాద్‌, న్యూఢిల్లీ, కోల్‌కతా, జూన్‌ 27 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ప్రణబ్‌ ముఖర్జీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకునే ప్రయత్నంలో భాగంగా జులై ఒకటవ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులతో ఆ రోజు ప్రణబ్‌ జూబ్లీ హాల్‌లో భేటీ కానున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలతో ఆయన సమావేశమవుతారు. సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సిఎల్పీ) శాసనసభ్యులందరికీ సమాచారం పంపింది. 294 మంది సభ్యుల శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి 155 మంది సభ్యులున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలను కలిగిన ఎంఐఎం పార్టీ ముఖర్జీ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. 86 మంది ఎమ్మెల్యేలున్న ప్రధాన విపక్షం తెలుగుదేశం, 17 మంది సభ్యులున్న ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ, 17 మంది సభ్యులున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై వారి నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి పిఎ సంగ్మా టిడిపి, టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరారు. కాగా, రాష్ట్రపతి అభ్యర్థి పిఎ సంగ్మా టిఎంసి చీఫ్‌ మమతా బెనర్జీని కలుసుకొని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాని ఆమె ఎలాంటి వాగ్దానం చేయలేదు. ఇందులో తొందరపడరాదని పార్టీ నిర్ణయించుకుంది. ”నేను మమతా బెనర్జీ మద్దతు కోసం ఇక్కడకు వచ్చాను. చర్చల సారాంశం నాకు సంతోషం కలిగిస్తోంది. ఎంతో ఆశతో తిరిగి వెళ్తున్నా. టిఎంసి నాకు మద్దతు ఇస్తుందని విశ్వసిస్తున్నా” అని ఆయన విలేకరులకు చెప్పారు. సుమారు 30 నిమిషాల పాటు మమతతో ఆయన సమావేశం అయ్యారు. అంతకు ముందు ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ను సమర్ధించాలని టిఎంసి నిర్ణయించినప్పటికీ ఆయన పోటీ చేసేందుకు అంగీకరించలేదు. కాగా సంగ్మాకు బిజెడి, ఎఐఎడిఎంకె పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. సంగ్మాకు మద్దతు పట్ల ఎన్డీఎలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారేంత వరకు అది వస్తుంది-పోతుంది అన్నట్లుగా ఉంది. కార్పొరేట్లు కూడా ఆయనకు అనుకూలంగా మారడానికి ఆయన అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ వేత్తలలో ఒకరిగా కాక, వారు అతనిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు వదిలి వెళ్లాలని కోరుకుంటున్నారు. వెనుకటి నుండి పన్ను వసూలు చేయడంతో జిఎఎఆర్‌ (గార్‌ జనరల్‌ యాంటి అవోరుడెన్స్‌ రూల్స్‌-పన్ను ఎగవేతదారులను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన నిబంధనలు) విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించారు. ఈ చర్యలు ఇటీవల బడ్జెట్‌లో నల్ల ఆదాయం ఉత్పత్తి అవకుండా నిరోషధించేందుకు ఉద్దేశించబడ్డాయి. అయితే అసలైన ఒత్తిడి విదేశాల నుండి రావడం ఆశ్చర్యాన్ని కలిగించదు. తమ విదేశీ సహచరులు భావించే వాటికి భారత్‌ కార్పొరేట్లు సున్నితంగా స్పందిస్తూ ఉంటారు. అలాగే మన రాజకీయ నాయకత్వమూ వొడా ఫోన్‌ కేసులో బ్రిటన్‌, నెదర్‌లాండ్‌లు తమ ప్రాబల్యాన్ని గట్టిగా ప్రయోగించాయి. ఇటువంటి ఒత్తిళ్ల ద్వారా మన రాజకీయాలు ఏ మేరకు నిర్ణయించబడుతున్నాయి ? ఇటీవల చోటు చేసుకున్న అనేక సంఘటనలు మన రాజకీయ వ్యవస్థపై ఎంతటి బలమైన ఒత్తిడిని తెస్తున్నాయో నిరూపిస్తున్నాయి. ఇటీవల హిల్లరీ క్లింటన్‌ భారత్‌ సందర్శన ఇరాన్‌తో వాణిజ్యం, రిటైల్‌ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) భారతదేశానికి సంబంధించి స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌ అండ్‌ పి)స్థాయి తగ్గింపు (డౌన్‌గ్రేడ్‌), ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ వ్యవహారం వంటి అంశాలపై ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించబడింది. కొన్ని అస్పష్టంగా కనబడే విదేశీ ఒత్తిళ్లు ఉన్నాయి. వాటిలో రక్షణ కొనుగోళ్లు, ఇంధన రంగ పెట్టుబడులు మార్కెట్‌ తలుపులు తెరవడం ఇంకా ఇంకా అనేకం ఉన్నాయి. 1987 నుండి మిత్రుడైన ఒట్టావియో ఖత్రోచి ముడుపులు వాళ్లలో ఒకడని నిగ్గుతేల్చే విస్పష్ట సాక్ష్యం ఉందని నొక్కి చెప్పారు. చివరి నిమిషంలో బోఫోర్స్‌ వ్యవహారంలో ఊగిసలాట ప్రదర్శించిన ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. ఇందులో ముడుపులు ఉన్నాయా, బోఫోర్స్‌ శతఘ్నలు మంచివా, అన్న వాటిలో అనుమానమే లేదు. ఇప్పటికీ తేలని సమస్యేమిటంటే ఈ డబ్బు ఎవరికి చేరిందన్నదే. కాంగ్రెస్‌ హయాంలో దేశం విడిచి వెళ్లేందుకు ఆయనకు అనుమతి లభించిందంటే, అది ఖత్రోచికి అధికార వర్గాల్లో మంచి స్నేహితులున్నారని ధృవీకరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ముడుపులన్నవి సామాన్యం, ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతిమయమైన దేశాల్లో స్వీడన్‌ ఒకటి. అయితే బోఫోర్స్‌ కేసు రుజువు చేస్తున్నట్లుగా ఆ దేశ కార్పొరేషన్లు మనదేశం నుండి కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు చెల్లించారు. అమెరికా దేశ చట్టప్రకారం చట్టవిరుద్ధం అయినప్పటికీ అమెరికా కేంద్రంగా గల బహుళజాతి సంస్థలు లంచాలకు పాల్పడుతాయి. మొత్తానికి ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక వంటి కేసులలో జరుగుతున్న దానిని చూస్తూ ప్రజలు కలవర పాటుకు గురవుతున్నారు.