మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంపై విమర్శలు

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను విఫల నాయకుడిగా అభివర్ణిస్తూ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ సృష్టించిన సంచలనం సద్దుమణగకముందే అమెరికాకు చెందిన ప్రముఖ దిన పత్రిక ‘వాషింగ్టన్‌ పోస్టు’ కూడా అదే తరహా కథనాన్ని ప్రచురించింది. మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ సాగిన ఈ కథనం బుధవారం ప్రచురితమైంది. ‘విషాదమూర్తిగా మారిన భారత మౌన ప్రధాని’ శీర్షికతో ఇందులో మన్మోహన్‌సింగ్‌ను అవినీతిలో మునిగిన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న అధికారిగా అభివర్ణించారు. ఆయన తడబాటు కలిగిన, ప్రభావరహితమైన వ్యక్తి అని స్పష్టం చేశారు. తమ కథనంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తన వాదనను వినిపిస్తే దాన్ని ప్రచురిస్తామంటూ ‘వాషింగ్టన్‌ పోస్టు’ ప్రకటించింది.