మరోసారి న్యాయస్థానానికి చేరిన ఫీజుల అంశం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఫీజుల అంశం మరోమారు న్యాయస్థానానికి చేరింది. అఫిడవిట్లు దాఖలు చేయకున్నా తమకు 27వేల ఫీజుల ఖరారుపై 10 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో ఉన్న తీర్పుల ఆధారంగా ఏకీకృత కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో ఉన్న తీర్పుల ఆధారంగా ఏకీకృత ఫీజుగా 40 వేల 200 చెల్లించాలని ఆ కళాశాలలు కోరాయి. కళాశాలలు కోరిన విధంగా ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు దాఖలు చేయని కళాశాలలకు 42 వేల 200 ఫీజులు చెల్లించేల నిర్ణయం తీసుకోవాలని ఏఎఫ్‌ఆర్‌సీని హైకోర్టు ఆదేశించింది.