మహిళల రక్షణ ప్రభుత్వ బాధ్యతే : షిండే

న్యూఢిల్లీ : మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. మరింత మంది మహిళా రక్షకభటుల నియామకానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జస్టిస్‌ వర్మ కమిటీ నివేదిక తర్వాత మహిళల రక్షణకు మరిన్ని చట్టాలు చేస్తామని షిండే ప్రకటించారు.