మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు
.మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు….భైంసా రూరల్ మార్చ్ 27 జనం సాక్షి- విశ్రాంతి భవనం ముందు నోటికి తాళం వేసుకొననిరసన…ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు చేయడం, రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ముధోల్ తాలూకా కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. సోమవారం బైంసా పట్టణంలోని విశ్రాంతిభవనం ముందు ముధోల్ తాలూకా కాంగ్రెస్ నాయకులు నోటికి నల్ల మాస్క్, తాళం వేసుకొని నిరసన చేపట్టారు.తెరాస అవినీతి అక్రమాలను మహేశ్వర్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే నిజాలు ఎక్కడ బయట పడతాయని మంత్రి కేసు నమోదు చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే పని అన్నారు. కేంద్రంలో భాజపా రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనకు త్వరలోనే ప్రజలు అడ్డు పడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ పటేల్, షేక్ ఆ0జద్, సాయినాథ్, ప్రశాంత్ పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.