మహేశ్‌బాబు, నమ్రతలకు కుమార్తె

హైదరాబాద్‌: ప్రముఖ కధానాయకుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులకు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాలకు  అమ్మాయి పుట్టింది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నమ్రతకు సుఖప్రసవమైందని తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ దంపతులకు గౌతమ్‌ కృష్ణ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.