” మాదాపూర్ దుర్గం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం…”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 07( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో సుమారు 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమయింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… తెల్లని మేని ఛాయ కలిగిన 35 సంవత్సరాల కలిగిన వ్యక్తి ఎరుపు రంగు టీ షర్ట్, తలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడని, మంగళవారం సాయంత్రం దుర్గం చెరువులో మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మాదాపూర్ పోలీసులు దుర్గం చెరువు వద్దకు చేరుకొని మృతదేహం వెలికి తీయగా అతని వద్ద ఏ ఆధారాలు లభించలేదు. దీంతో గుర్తు తెలియని కేసుగా నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు ఎవరికైనా అనుమానం ఉంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. ఇతర వివరాలకై మాదాపూర్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8331013220 లేదా మాదాపూర్ ఇన్స్పెక్టర్ నెంబర్ 9490617182 కి ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.