‘ మార్చ్‌’ అనుమతి కోసం బీజేపీ ర్యాలీ

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని బాగ్‌లింగపల్లి నుంచి బీజేపీ శాంతి ర్యాలీ చేపట్టింది. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో తెలంగాణ ప్రాంతంలో ఉద్రికత్తలకు కారణమవుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. శాంతి యుతంగా జరిగే హైదరాబాద్‌ మార్చ్‌ను అడ్డుకుంటే ప్రజలు తిరగబడి హింసాత్మక సంఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైన కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.