మిర్యాలగూడ పట్టణ టిడిపి కన్వీనర్ గా శ్రీనివాస్ ఎంపిక: పలువురు హర్షం…

 

మిర్యాలగూడ, జనం సాక్షి
తెలుగుదేశం పార్టీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ గా వడ్డేపోయిన శ్రీనివాస్ ను నియమిస్తూ జాతీయ టిడిపి క్రమశిక్షణ కమిటీ సభ్యులు, నల్లగొండ పార్లమెంట్ పరిశీలకులు బంటు వెంకటేశ్వర్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ పట్టణ కన్వీనర్ గా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. తెలుగు విద్యార్థి సంఘంలో పనిచేసిన అనంతరం టిడిపి యువజన విభాగంలో పనిచేశారు. టిడిపి బిసి సంఘంలో పనిచేసి టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శిగా గత నాలుగు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. వడ్డే బోయిన శ్రీనివాస్ పార్టీ కోసం చేస్తున్న పనిని రాష్ట్ర అధిష్టానం గుర్తించి పట్టణ కన్వీనర్ గా నియమించడం జరిగిందని టిడిపి నాయకులు పేర్కొంటున్నారు. పట్టణ కన్వీనర్ గా తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సందర్భంగా వడ్డే పోయిన శ్రీనివాస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో 48 వార్డులలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. శ్రీనివాస్ ఎంపిక పట్ల పట్టణం చెందిన పలు వార్డుల కన్వీనర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, హర్షం వ్యక్తం చేశారు.