ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిచనున్నా బీజేపీ

బెంగళూరు: కర్ణాటక సీఎం మార్పుపై భాజపా అధిష్ఠానం నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకడానికి పార్టీ అధ్యక్షుడు గడ్కరీ నివాసంలో నిన్న కోర్‌కమిటీ భేటీ అయిచర్చించింది. సదానందగౌడ్‌ను మార్చి యడ్యూరప్ప వర్గం మద్దతున్న జగదీష్‌శెట్టర్‌కు సీఎం పీఠం అప్పగించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సదానంద ఈ సాయంత్రంలోగా సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.