ప్రశాంతంగా డీఎస్పీ పరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన డీఎస్పీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే విద్యుత్‌ సమస్య డీఎస్సీ అభ్యర్థులనూ వదిలిపెట్టలేదు. పరీక్ష రాస్తున్న పలు కేంద్రాల్లో కరెంటు పోవడంతో అభ్యర్థులు చీకటి గదుల్లోనే పరీక్ష రాశారు.