ముస్లిం మైనారిటీ గ్రామ, యువజన విభాగం కమిటీలు నియామకం

share on facebook

ముస్లిం మైనారిటీ గ్రామ, యువజన విభాగం కమిటీలు నియామకం. ముస్లిం మైనారిటీ గ్రామ, యువజన విభాగం కమిటీలు నియామకం.
బూర్గంపహాడ్ డిసెంబర్ 02 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగ కాంతా రావు ఆదేశాల మేరకు ముస్లిం మైనారిటీ గ్రామ కమిటీ, గ్రామ యువజన విభాగం కమిటీని నియమించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో గ్రామ కమిటీ, గ్రామ యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని మైనారిటీ మండల ఇంచార్జి జక్కం సుబ్రహ్మణ్యం అన్నారు. మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ సాధిక్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ ప్రధాన కార్యదర్శి గుల్ మొహమ్మద్ మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయాల్లో యువకులు అన్నీ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ప్రచారం చేయాలన్నారు. విప్ రేగ చేస్తున్న అభివృద్ధిని అందరికి తెలిసేలా గ్రామంలో ఉన్న నాయకులు, యువత బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గం అభివృద్ది కేవలం విప్ రేగా తోనే సాధ్యం అన్నారు. ఈ మేరకు ఎన్నుకున్న నాగీనేని ప్రొలు రెడ్డి పాలెం గ్రామ కమిటీ  అధ్యక్షులుగా మొహమ్మద్ సత్తార్,  ఉపాధ్యక్షులుగా షేక్ అబ్బాస్, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఇమామ్ సాబ్, కోసాధి కారిగా షేక్ యాకూబ్ పాష ను మరియు కార్య వర్గాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. యూత్ కమిటీ అధ్యక్షుడిగా షేక్ శారూఫ్, ఉపాధ్యక్షులుగా షేక్ ఆఫ్రోజ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ వాజిద్, కోశాధికారిగా షేక్ ఫాయాజ్, కార్య వర్గ సభ్యులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ అధ్యక్షుడు కాటం వెంకట రామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి షేక్ గుల్ మొహమ్మద్, గ్రామ ప్రజలు, గ్రామ యూత్ పాల్గొన్నారు.

Other News

Comments are closed.