మెక్సిలో భారీ అగ్ని ప్రమాదం 26 మంది మృతి

విక్టోరియా: మెక్సికో సరిహద్దులోని సహజ వాయివు పైప్‌లైన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26మంది కార్మికులు మృతి చెందారు. 46మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గ్యాస్‌ లీక్‌ అనంతరం మంటలు చెలరేగినట్లు కంపెనీ సిబ్బంది తెలిపారు. మృతుల్లో నలుగురు పెమెక్స్‌ ఉద్యోగులను మిగితవారంత కాంట్రాక్ట్‌ కార్మికును సెంటర్‌ డైరెక్టర్‌ జాన్‌జోన్‌ తెలిపారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.