మైదా పిండిని ఎట్లా? తయారు చేస్తారు!”” 

                 మెజారిటీ ప్రజలు బియ్యం,గోధుమలను ప్రధాన ఆహారంగా భుజించుతారు.
వరి ధాన్యం(వడ్లు)నుండి బియ్యాన్ని తయారు
చేస్తారు.గోధుమల నుండి గోధుమ పిండిని తీస్తారని
అందరికి తెలుసు. కాని గోధుమల నుండి మైదా పిండిని కూడా తీస్తారనే విషయం చాలామందికి తెలియదు.ఒక వేళ తెలిసిన గోధుమ పిండి కిలో ధర
రూ.60 నుండి 65కు ఎందుకు అమ్ముచున్నారు.
మైదా పిండిని కిలోకు రూ.30 నుండి 40కి ఎందుకు అమ్ముచున్నారనే ప్రశ్నలు మాత్రం కొందరికి తెలియని
జవాబు.ప్రపంచంలో గోధుమలను పండించే దేశాలలో
చైనా మొదటిది కాగ, భారత్ రెండో అతి పెద్ద దేశం.
2023 లో  వరి 135 మిలియన్ మెట్రిక్ టన్నులు పండగా, గోధుమలు 112.74 మిలియన్ మెట్రిక్
 టన్నులు పండినవి.గోధుమ గింజలలో బ్రన్(BRAN)
జర్మ్ (GERM) మరియు ఎండోస్పెర్మ్
(ENDOSPERM)  ఉంటాయి.ఇందులో మెగ్నీషియం,
జింక్,ఫైబర్, మాంగనీస్, భాస్వరం,యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు,  మినరల్స్ ఉండి ఆరోగ్యంకు తోడ్పడుతాయి.
                          మిల్లింగ్/పిండి చేసే ముందు గోధుమలలోని తేమను,మాంసం కృత్తులను,బ్లూటిన్
ఖనిజాలను, ఇతర పోషకాల పరిణామాలను సేకరించుతారు.దానికి అనుగుణంగా నేల మాళిగలలో
నిల్వ చేస్తారు. సహజమైన రీతిలో గోధుమలను శుభ్రం చేయడానికి కన్వేయర్ ప్రక్రియలో పైకి పంపించి కిందపడేటట్లుగా ఏర్పాట్లు చేస్తారు.అలా శుభ్రమైన గోధుమలను జల్లెడ డ్రమ్ములలో తిప్పించి చెత్త చెదారంను తొలగించి గ్రావిటీ క్లీనింగ్ సెక్షన్ కు పంపించుతారు. అందులో ఒక దాని మీద ఒకటిగా
అమర్చిన జల్లెడల మీద పడిన గోధుమలు
ప్లోబ్యాలెన్సర్ ద్వారా స్టోరేజీ ట్యాంక్ లో పడతాయి.
ఇతర గింజలు,గడ్డి పరకలు మరోవైపు వేరవుతాయి.
మరల స్టోరేజీ ట్యాంక్ నుండి క్రమపద్ధతిలో ఎలక్ట్రానిక్
మ్యాగ్నెట్ డిస్టోనర్ లోకి పంపించి గోధుమలలో ఉన్న ఏమైనా లోహపు మొలలు, నట్లు,తీగెలను తొలగించుతారు.మరల కదిలే జల్లెడలతో కంపింప చేసి నూలు పొగులు, ఇతరత్రా వాటిని తొలగించు
తారు.మరల ఒక వైపు వాలి ఉన్న వైబ్రో డిస్టోనర్ లో కంపించే జల్లెడల మీదకు గోధుమలను పంపించి     కింది భాగం నుండి వేగంగా గాలిని ప్రసరింపచేసి   ఇసుకను పోలిన రాళ్లను ఇతరత్రా పదార్థాలను తొలగించి గోధుమలను స్కోరరీ మిషిన్ లోకి పంపిస్తారు.నిరంతరంగా తిరిగే రోలర్ లతో,గేర్ లను
పోలిన క్రషింగ్ ద్వారా నలుగగొట్టి గోధుమలపై ఉన్న పొట్టును వేరు చేస్తారు.ఇలా వివిధ దశలలో శుభ్రం చేసిన గోధుమలను గ్రైన్ వాషర్ లోకి పంపించి నీటితో
కడిగిన పిదప డ్రయర్ లోకి పంపించి ఎలక్ట్రిక్ హీటర్స్
ఫ్యాన్ లతో గోధుమలను పొడిబారపెట్టి కన్వేయర్ ద్వారా సురక్షితమైన నిలువ గదుల్లో భద్రపరుస్తారు.అప్పుడు గోధుమ పిండి కావాలంటే
పిండి మిల్లులలోకి పంపించి యంత్రపు తెరగలతో  పిండి చేస్తారు.
                            ఇక మైదా పిండిని తయారు
 చేయడానికి అన్ని దశలలో శుధ్ధి చేసిన గోధుమలను మైక్రోవేవ్ అండ్ ఆప్టికల్ సెన్సార్స్ ద్వారా  మాయిస్టర్ ను తనిఖీ చేసి  టర్బోలైజర్ డెమ్ ఆర్లోకి పంపించి
కావలసిన నీటిని కలుపుతారు. గోధుమలకు 7 నుండి 20 శాతం తేమ వచ్చే వరకు  రోటర్ ల ద్వారా కలుపుతారు.కావలసిన తేమ వచ్చిన
గోధుమలను ఒల్డింగ్ ట్యాంక్ లలోకి పంపించి 10 నుండి 12 గంటల పాటు నిల్వ ఉంచుతారు. దానితో
గోధుమలపై ఉన్న పైపొర మెత్తబడి ఎండోస్పెర్మ్ (పిండాన్ని పోషించే కణజాలం)బయటపడుతుంది.
 అప్పుడు క్రాకింగ్ మిల్లులోకి పంపించి రోలర్స్ ద్వారా గోధుమలను పిండి కాకుండా నలుగగొట్టబడిన గింజలు బ్రన్, ఎండోస్ప్రేర్మ్,జర్మ్ గా విడిపోయి మిశ్రమం రూపకంగా బయటకు వస్తాయి.
 అట్టి మిశ్రమాన్ని ఫ్యూరిపయర్ చేసి
 సమాంతరంగా ఉండి,ఎగువన పెద్దగాను దిగువకు వచ్చే కొలది చిన్నగా ఉండే రంధ్రాల     జల్లెడలలో వెదజల్లే విధముగా పీడర్ లోకి పంపించి
 జల్లెడల దిగువ భాగం నుండి వేడి గాలి ప్రసారమయ్యే ఏర్పాట్లు చేస్తారు.అప్పుడు నలిగిన గోధుమ గింజలలో తేలికగా ఉండే బ్రన్,జర్మ్ మిశ్రమాలను పిండి మిల్లుకు పంపించి ఎండోస్పెర్మ్ ను
 సెమోలినా,సూజీగా,రవ్వగా తయారు చేస్తారు.   అలాగే మైదా పిండిని తయారు చేయడానికైతే ఎండోస్పెర్మ్ ను /రవ్వను రోలర్స్ మిల్లుకు పంపించి
పిండి చేస్తారు.మెత్తగా, మృదువుగా తయారు కావడానికి పలు స్టేజీలలో రోలర్ ల ద్వారా
 పిండిని 200 మైక్రొన్ ల కంటే తక్కువ పరిమాణం తగ్గకుండా పిండి చేస్తారు.తరువాత సన్నని రంధ్రాల
జల్లెడలు ఉన్న ప్లాన్ షిప్టర్ లోకి పంపించి పలు మార్లు
జల్లెడ పట్టి 10 నుండి 100 మైక్రోన్ ల పరిమాణంతో
మైదా పిండిని తీస్తారు. మైదా పిండితో పాటుగా వేరు
పడిన మొరుమును మరల రోలర్ మిల్లులోకి పంపించి
తెరగలతో పిండిని తయారు చేస్తారు.
                               వైద్య శాస్త్రం మైదా పిండిని వైట్ పాయిజన్ గా హెచ్చరిస్తోంది.గోధుమలలోని ఊక మరియు బీజాన్ని(జెర్మ్)  వేరుచేసి మిగిలిన ఎండోస్పెర్మ్  నుండి మైదా పిండిని తయారు చేస్తున్నారు.  మైదా పిండిని తెల్లగా,మృదువుగా చేయడానికి “”పొటాషియం బ్రోమాట్ ””,బెంజాయిల్ పెరాక్సైడ్””,క్లోరిన్,”” అలోక్సన్ అనే రసయానాలను
కలుపుతారని తెలుస్తుంది. ఈ రసాయనాలు డయాబెటిస్ మెల్లిటస్ ను ప్రేరేపించి మూత్రపిండాలు, కాలేయ సంబంధ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. మైదాలో ఉండే జిగురు వలన పేగులకు అసౌకర్యం కలిగి జీర్ణవ్యవస్థ నెమ్మదించి మల బద్ధకం,
ఊబకాయం, ఉబ్బరానికి దారీతీస్తుంది.గ్లైసెమిక్  ఇండెక్స్ ఎక్కువగా ఉండి, రక్తంలో చక్కెర స్థాయిని పెంచి టైప్ –2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.
మైదాలో ఫైబర్, విటమిన్లు బి1,బి5,బి12 పోలేట్ మరియు రిబోప్లేవిన్,ఖనిజాలు లేనందున దీర్ఘకాలిక
వ్యాధులు రావడానికి అవకాశం ఉంది.మైదా ఆహార
పదార్థాలలో,బిర్యాని, ప్రైడ్ రైస్, సూప్ లలో “‘అజీనోమోటోను”‘ కలిపినట్లయితే రుచిని పెంచుతాయని తెలుస్తుంది.జిహ్వ చాపల్యానికి తీర్చగలిగిన ఆహార పదార్థాలను భుజించడానికి ఇష్టపడడం సహజం.అలాగే ఆహార నియమాలను పాటించడం వలన ఆరోగ్యంతో జీవించే అవకాశం  ఉన్నదనే సత్యాన్ని గుర్తించి ఆచరించడం కూడా అలవర్చుకోవడానికి సిద్ధపడాలి.మైదా పిండితో తయారు చేసే పరోటాలు,బోండాలు,పూరీలు,బిస్కెట్లు,
పిజ్జాలు,బర్గర్ లు,చాక్లెట్లు, బ్రెడ్ లు,పునుగులు, సమోసాలు,రవ్వదోసాలు,అట్లు,బొబ్బట్లు, బక్షాలు,
జిలేబీలు,రుమాల్ రోటీలు,కాజాలు,కేక్ లు,హాల్వాలు
మొదలగు ఆహార పదార్థాలను భుజించడo తగ్గిస్తే
ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉన్నదని వైద్య శాస్త్రం,డాక్టర్లు, డైటీషియన్లు(పథ్యాహార నిపుణులు)
సూచించుచున్నారు.
కృతజ్ఞతలతో,         మీ భవదీయుడు
                             మేరుగు రాజయ్య
               సెల్ నంబర్ — 9441440791.