మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
హైదరాబాద్: రాష్ట్రంలో మైనార్టీల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పిసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన పిసీసీ రాష్ట్రస్థాయి మైనార్టీల సమావేశంలో రాష్ట్ర మంత్రులు మాణిక్య వరప్రసాద్, అహ్మదుల్లా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు కేబీ కృష్ణమూర్తి తదితరులు పాల్గోన్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ఓబీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధం లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల ప్రయోజనాలు కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని కేబీ కృష్ణమూర్తి తెలిపారు.