మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ మార్చి 21 (జనం సాక్షి) పట్టణం లోని వాసవి కళ్యాణ మంటపం లో మెప్మ, మండల మహిళా సమక్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు క్రమం తప్పకుండా బ్యాంకులకు రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకుల మన్ననలు చూరగొన్నదని, నేడు బ్యాంకులను నడిపిస్తున్న గౌరవం మహిళలకే దక్కిందని అన్నారు. మహిళలు ఎక్కడ పూజింపబడుతారో అక్కడ దేవతలు నడయాడుతారని, కాబట్టి పురుషులతో పాటు సమానంగా మహిళలు గౌరవిస్తూ అన్ని రంగాలలో వారికి అవకాశాలు ఇచ్చి ఎదగనివ్వాలని కోరారు. ఆడపిల్లలను బాగా చదివించాలని, వారు ఆర్థికంగా నిలదొక్కుకొని స్వావలంబన సాధించిన నాడే వివాహాలు చేయాలని, తద్వారా ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొనే మనో స్థైర్యం , ధైర్యం వస్తుందని అన్నారు కార్యక్రమంలో మోగుడంపల్లి జడ్పీటిసి మోహన్ రెడ్డీ, డిస్ట్రిక్ట్ డిసిసిబి డైరెక్టర్ కిషన్ పవర్, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, మాజీ జడ్పీటిసి మానెమ్మ, మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డీ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దిన్, మోగుడంపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు, మహంకాల్ సుభాష్, మూర్లికృష్ణ గౌడ్, మోగుడంపల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు బంగారి సురేష్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ, జాగృతి జిల్లా అధ్యక్షురాలు అనుషమ్మా, పట్టణ మహిళ అధ్యక్షురాలు మంజుల, జహీరాబాద్ మండల అధ్యక్షురాలు సరస్వతి రెడ్డీ, మాజీ కౌన్సిలర్ లు, ఆయ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.