యడ్యూరప్ప అనుచరులపై వేటు

ఢిల్లీ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుచరులు తమకూరు ఎంపీ జీఎస్‌ బసవరాజు, మంత్రి పుట్టస్వామిపై భాజపా వేటు వేసింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. క్రమశిక్షణ ఉల్లఘించిన  కారణంగానే వారిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.