యువత ఉద్యమిస్తేనే అవినితిరహిత భారతం

హైదరాబాద్‌ : సమాజంలో అవినితి క్యాన్సర్‌లా వ్యాపిస్తుందని, అందుకే భారత్‌ వెనుకబడుతుందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. యువత 2020లక్ష్యంగా పెట్టుకొని మరో స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్దం కావాలని అయన పిలుపునిచ్చారు. నగరశివారు శంషాబాద్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న లీడ్‌ఇండియా శిక్షణతరగతుల కార్యక్రమంలో ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గున్నారు. అవినితిని అంతమొందిచాలన్నా,అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల సరసన భారతదేశం నిలువలన్నా యువత ఉద్యమించాక తప్పదని అయన అన్నారు.