రంజాన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇఫ్తారు విందు

హైదరాభాద్‌: రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విధు ఇచ్చారు. దర్బార్‌ హాల్‌లో జరిగిన ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలసి గవర్నర్‌ పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఉపసభాపతి భట్టి వక్రమార్క మండలి ఛైర్మన్‌ చక్రపాణి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ, మంత్రులు అహ్మదుల్లా, పొన్నాల లక్ష్మయ్య, గల్లా అరుణకుమారి, గంటా శ్రీనివాసరావు, ఎంపీ చిరంజీవి ఇతర రాజకీయ నేతలు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నాతాదికారులు పాల్గొన్నారు.