రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తాం
నెల్లూరు : తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని డీజీపీ దినేష్ రెడ్డి హెచ్చరించారు. వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని అసందర్బ వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని ఇరు ప్రాంతాలవారికి ఆయన సూచించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ తాము కేంద్ర బలగాలు కావాలని కోరలేదని స్పష్టం చేశారు. ప్రజలు అధైర్యవపడాల్సిన పనిలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మవద్దంటూ సూచించారు. తెలంగాణ సమస్యను భూతద్దంతో చూపవద్దన్నారు. అందరూ సామరస్య పూర్వకంగా ఉండాలని ఆయన సూచించారు.