రాజకీయాపార్టీలు రాయలసీమపై వైకరి ప్రకటించాలి:రాయలసీమ పరిరక్షణ కమీటి

హైదరాబాద్‌: రాయలసీమ పరిరక్షణ కమీటి కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయా పార్టీలన్ని రాయలసీమపై తమ  వైకరి ప్రకటించాలన్నారు. రాయలసీమ కరువు,కాటకాలతో అల్లాడుతుందన్నారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు లేఖలు రాస్తే, రాయలసీమ ఏర్పాటు గురించికూడా ప్రస్తావించాలన్నారు. ఈ నెల 4నుంచి నాలుగు జిల్లాను కలుపుకొంటూ నిరహార దీక్షలు చేస్తామన్నారు.