రాజేంద్రనగర్‌లో భూ వివాదం
హైదరాబాద్: రాజేంద్రనగర్ రాంబాగ్‌లోని 500 ఎకరాల భూమి తమదేనంటూ దేవాదాయశాఖ అధికారులు బోర్డు పాతారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. పాతికేళ్లుగా ఇక్కడే ఉంటున్నా. తమకు ముందుగా ఎందుకు తెలపలేందటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.