రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు
హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాగల 24గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూన్ 1నుంచి జులై 18 వరకు 194.6మి.మి వర్షం కురవాల్సి ఉండగా 136.9మి.మి పడిందని పేర్కొంది. ఈ సీజన్‌లో కురవాల్సిన వర్షం 4శాతం తక్కువగా ఉందని తెలిపింది.