రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌్‌ : జిల్లాలోని రామగుండం జాతీయ విద్యుత్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్టీసీపీ)లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఎన్టీపీసీలోని ఏడో యూనిట్‌లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌లో ఓ ట్యూబ్‌ లీక్‌ కావడంతో యూనిట్‌ ట్రిప్‌ అయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు లోపాన్ని గుర్తించి మరమ్మతు చర్యలు చేపట్టారు.