రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి: టీజీ

న్యూఢిల్లీ: రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్రమంత్రి, రాయలసీమ హక్కుల వేదిక నేత టీజీ వెంకటేశ్‌ కోరారు. కర్నూలు నుంచి రాజధానిని తరలించడంతో సీమ ప్రాంతం దాదాపు లక్ష కోట్ల రూపాయల అభివృద్ధిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.