రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం

హైదరాబాద్‌: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం తెలిపింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు తాము అంగీకరించబోమని తెలుగుదేశం తెలంగాణ  ఫోరం నేతలు మోత్కుపల్లి  నిర్సింహులు, మహేందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలను గట్టెక్కించడానికే తెలంగాణ అంశాన్ని కేంద్రం మరోమారు తెరపైకి తెచ్చిందని నేతలు చెప్పారు. మరోమారు తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.