రాష్ట్రంలో తేలికపాటి వర్షాలకు అవకాశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒకట్రెండుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. పశ్చిమ మథ్య బంగాళాఖాతంలో  ఏర్పడ్డ అల్పపీడనం బలహినపడిందని చెప్పారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు విస్తరించినట్లు వెల్లడించారు.