రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే ఆవకాశం ఉన్నట్లు తెలిపింది.