రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొట్టే హన్మండ్లు
కుబీర్ ( జనం సాక్షి ); హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముధోల్ నియోజకవర్గం, కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన కొట్టే హన్మండ్లు ను ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండ దేవయ్య కు ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా ముధోల్ నియోజకవర్గ కుల సోదరులందరికీ కృతజ్ఞత భావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షుడు కొండ దేవయ్య, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పురుషోత్తం, నిర్మల్ జిల్లా అధ్యక్షులు జుట్టు అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.