రాష్ట్ర ప్రజలను వదిలి ఢిల్లీ ప్రదక్షిణలతో కాలక్షేపం

హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రజలను వదిలేసి కాంగ్రెస్‌ నేతలు 10 జనపథ్‌  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఢిల్లీపర్యటనలతో కాలక్షేపం చేస్తున్న అధికార పార్టీ నేతలు ప్రజాగ్రహానికి గురయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికుల సమస్యల మీద పెండింగ్‌ ప్రాజెక్టుల క్టియరెస్స్‌ కోసం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స ఢిల్లీ పర్యటన చేయకుండా తమ పదవులు  వూడగొట్టేందుకు 10 జనపథ్‌ చుట్టూ  ప్రదక్షిణలు చేయడం  దారుణమన్నారు. ఉప ఎన్నికలు అయిన వెంటనే ఢిల్లీ పెద్దలను కలిసి నివేదికలు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు.