రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

విశాఖ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం గూడెంకోత్తవీధిలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన గంజాయిని సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. బొలేరో, తవేరా వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని ఆరెస్టు చేసినట్లు పోలిసులు తెలియజేశారు.