రూ.29-30వేల మధ్య పసిడి ధర!

హైదరాబాద్‌, జూలై 11 : పసిడి ధర 29-30 వేల రూపాయల మధ్య ఉంటోంది. పెళ్లిళ్లు లేకపోయినా ధర పైపైకి ఎదుగుతు ఉండడం పట్ల మధ్యతరగతి ప్రజలు అవసరమైనంత మేరకే కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. బుధవారంనాడు హైదరాబాద్‌, విజయవాడ, పొద్దుటూరు, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విశాఖపట్నం మార్కెట్‌లో రూ.29,970, 22 క్యారెట్ల బంగారం 27,470, కిలో వెండి రూ.53,900 పలుకుతోంది. విజయవాడలో 29,610, 27,530, 57,400 రూపాయలు ఉంది. అలాగే పొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.29,800, 22 క్యారెట్ల బంగారం రూ.27,350, వెండి కిలో 52,700 రూపాయలకు చేరింది. అలాగే హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,970, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,640 రూపాయలు, వెండి కిలో 52వేల రూపాయలకు చేరింది.