రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షునికి సన్మానం రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షునికి సన్మానం
సైదాపూర్ జనం సాక్షి మార్చి 20 రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నరహరి జగ్గారెడ్డిని మండలంలోని లస్మ న్నపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సంఘం ప్రతినిధులు సోమవారం ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. రాబోయే రోజుల్లో రెడ్డి సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలని అధ్యక్షునికి వారు విజ్ఞప్తి చేశారు.లస్మన్నపల్లి రెడ్డి సంఘం భవన నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు కొట్టే వెంకటరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మ్యాకల రాజిరెడ్డి , టిఆర్ఎస్వి నాయకులు మ్యాకల మల్లారెడ్డి, ప్రతినిధులు పాల్సని రామ్ రెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, జాల మహేందర్ రెడ్డి, జాల సంపత్ రెడ్డి,కొంపెల్లి రాజిరెడ్డి, తిప్పబతిని శ్రీనివాస్ లు పాల్గొన్నారు.