రెస్సారెస్సీకి నీటి విడుదలపై మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రెస్సారెస్సీకి శుక్రవారం నీటిని విడుదల చేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెదేపా నేత ఎర్రబెల్లి తెలిపారు. ఎస్సారెస్పీకి నీరు విడుదల చేయాలని కోరుతూ నాయకులు ఈ రోజు మంత్రి సుదర్శన్‌రెడ్డి ఛాంబర్‌ ఎదుట ధర్నా చేశారు. దీంతో నీటి విడుదలపై మంత్రి హామీ ఇచ్చారని ఎర్రబెల్లి తెలిపారు. రేపటిలోగా నీటిని విడుదల చేయకపోతే సీఎం ఛాంబర్‌ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎస్సారెస్పీకి నీటిని విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం మూడు నెలలుగా కాపయాపన చేస్తోందని ఆరోపించారు. బాబ్లీ ప్రజెక్టు విషయంలో ముఖ్యమంత్రికి,మంత్రి సుదర్శన్‌రెడ్డి అవగాహన లేదన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారన్నారు.