రేపు ‘టీ’ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా విద్యాసంస్థల బంద్‌కు మంగళవారం టీఎస్‌ జేఏసీ పిలుపునిచ్చింది. విద్యాసంస్థలను స్వచ్ఛందందగా  మూసివేసి నిరసన తెలపాలని పేర్కొంది. విజయమ్మ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు పాశవికంగా దాడి చేశారు. విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.