రేపు తెలంగాణ సాధన స్ఫూర్తి దినం : టీజేఏసీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా డిసెంబర్‌ 9న ‘ తెలంగాణ సాధన స్ఫూర్తి దినంగా’గా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో కొవ్తొత్తులతో ప్రదర్శిన నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహారదీక్షుకు పూనుకోవడంతో డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.