రేపు హైదరాబాద్‌ రానున్న దాదా

హైదరాబాద్‌: యూపీఏ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహాల్‌ వెళ్లి సీఎల్పీ సమావేశం పాల్గొంటారు. అనంతరం తాజ్‌ కృష్ణలో బస చేసి మధ్యాహ్నం బెంగళూరు వెళ్తారు. మజ్లిస్‌ నేతలు కూడా రేపు ప్రణబ్‌ను కలవనున్నారు. ప్రణబ్‌ పర్యటనకు సంబంధించి జూబ్లీహాల్‌లో  ఏర్పాట్లను పీసీసీ చీఫ్‌ బొత్స పరిశీలించారు.