రైతులకు రుణ మాపి వెంటనే   చేయాలి. 

రైతులకు రుణ మాపి వెంటనే   చేయాలి.                    రైతులకు రుణ మాపి వెంటనే   చేయాలి.
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లో ప్రభుత్వం విఫలం.
పత్తికి క్వింటాలు ధర 15000, వరికి 2500 ఇవ్వాలి.
టీపీసీసీ సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్.. డిమాండ్
రైతు సమస్యలపై ఉట్నూర్ లో బారి ఎడ్ల బండ్లు ర్యాలీ.                                                                                                                    జనం సాక్షి ఉట్నూర్.
రైతు సమస్యలపై టీపీసీసీ పిలుపు మేరకు ఖానాపూర్ నియోజకవర్గం లోని ఉట్నూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయాధ్ ఇక్బల్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్,టీపీసీసీ సభ్యులు,ఉట్నూరు జడ్పిటిసి చారులత రాథోడ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారత్ చౌహాన్ లు మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీ ఏకకాలం లో చేస్తానని చెప్పి చేయకపోవడం వలన రైతులకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రుణాలు చెల్లించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలనీ,కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకే గతంలో కూడా కల్లలలో కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం చేసింది,వరి కలలలో వెళ్లి వరి కొనుగోలు వెంటనే చేపట్టాలని నిరసన చేయడం జరిగిందని అప్పుడే ప్రభుత్వం దిగి వచ్చి వరి కోనుగోలు చేసిందని గుర్తు చేశారు,ఆ సమయంలో ఏ రైతు వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ వరి కొనుగోలు కేంద్రాలలో వెళ్లేసి రిబ్బన్లు కత్రించడం,రైతులు ప్రశ్నిస్తే వారిని బెదిరించడం,భయబ్రాంతులకు గురిచేయడం ఆమె అహంకారానికి నిదర్శనం అన్నారు.రైతుల ఎవరు కూడా ఇలాంటి ఎమ్మెల్యేలను భయపడాల్సిన అవసరం లేదన్నారు.అదేవిధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డిజిల్,వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగించి,పత్తికి క్వింటాలు ధర 15000, వరికి 2500 ఇవ్వాలనీ డిమాండ్ చేసారు.ధరణీ పోర్టల్ ను రద్దు చేసి భూ సమస్యకు ఉన్న వారి సమస్యకు పరిష్కరించి పట్టాలు ఇవ్వలని.అసైన్డ్ భూలను సమగ్ర భూసర్వే జరిపి నిజమైన హక్కు దారులకు పట్టా పాసు పుస్తకాలు అందించాలి.దళితులకు దళిత బస్తి పచ్చి అబ్బాధం,ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి.2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములకు గ్రామా సభలు నిర్వహించి భూ సమస్యలు పరిష్కారం చేసి పట్టాలు ఇవ్వాలి.రెవెన్యు, అటవీ శాఖ మధ్య సరిహద్దు వివాదాలు తొలగించాలి.ఆ తర్వాత అటవీ, రెవెన్యు శాఖ ల మధ్య సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలి.సాగులో ఉన్న భూమి రెవెన్యు భూమిగా తేలితే రెవెన్యూ చట్టాల ప్రకారం పట్టాలు ఇవ్వాలి.దాన్యం కొనుగోలులో తరుగు పేరు మిద గత రెండు మూడు సంవత్సరాలుగా మిల్లరు చేసిన దోపిడీ మిద పూర్తి విచారణ జరపాలి.కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన వెంటనే రైతులకు ట్రాక్ సిట్ ఇవ్వాలి.ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, ఎస్టీ సెల్ల్ జిల్లా కార్యదర్శి సునీల్ జాదవ్, పెంధుర్ ప్రభాకర్,సర్పంచ్ ఆత్రం రాహుల్,మైనార్టీ అధ్యక్షుడు సలీం,దళిత అధ్యక్షుడు అచ్ఛ దేవానంద్,మైనార్టీ పఠన అధ్యక్షుడు ఇమ్రాన్,బిరుదులు లాజర్,బచల రవి,దూట రాజేశ్వర్, అరకిల పరమేశ్వర్,బానోత్   జైవాంత్ రావు,జావేద్ భాయ్,అశోక్,శ్రీరామ్, గున్వంత్, జుగాధిరావు,మనకు పటేల్, రధభాయి,ప్రేమ్ కుమార్, భగవంత్,సుధాకర్, వెడ్మ జంగు,వెడ్మ రాము, భీమ్రావు,మల్లారెడ్డి, జాక్కు, తెలగ్రావు,సాయి,రైతులు తదితులు ఉన్నారు.